Watch: వంతెనను తాకుతూ ప్రమాదకరంగా నది ప్రవాహం.. భయంతో పరుగెత్తిన జనం
river water rises | భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నది ఉధృతంగా ప్రవహించింది. పరవళ్లు తొక్కిన నీటి ప్రవాహం వంతెనను తాకింది. ఆ బ్రిడ్జిపై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేకలు, అరుపులతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
పాట్నా: భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నది ఉధృతంగా ప్రవహించింది. పరవళ్లు తొక్కిన నీటి ప్రవాహం వంతెనను తాకింది. (river water rises) ఆ బ్రిడ్జిపై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేకలు, అరుపులతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వరదలకు కోసి, బాగమతి సహా ఆ రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
కాగా, కోసి డ్యామ్ నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో ఆ నది ఉప్పొంగడంతో అక్కడున్న వంతెనను నీటి ప్రవాహం తాకుతున్నది. ఇది చూసి ఆ బ్రిడ్జిపై ఉన్న జనం భయాందోళన చెందారు. అరుస్తూ వంతెన పైనుంచి పరుగెత్తారు. దీంతో పోలీసులు స్పందించారు. మహిళలు, పిల్లలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. కొందరు వ్యక్తులు ఫొటోలు తీయడంలో బిజీ అయ్యారు.
మరోవైపు రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రంజన్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కోసి డ్యామ్ నీటిమట్టం పెరుగడం వల్ల నది ఉప్పొంగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో నదుల చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లవద్దన్న ప్రభుత్వం హెచ్చరికలను ప్రజలు పాటించాలని కోరారు. ప్రజలు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कोसी बांध का जलस्तर बढ़ने से नदी उफान पर है। इस संबंध में सुपौल, सहरसा, मधेपुरा, मधुबनी, दरभंगा, खगड़िया, भागलपुर, कटिहार और नवगछिया के सभी निवासियों से मेरी विनम्र अपील है कि बांध से दूर रहें और जिला प्रशासन द्वारा जारी हाई अलर्ट का सख्ती से अनुपालन करें। जरूरतमंदों की सहायता के… pic.twitter.com/28KJ6Ir2hv
— Ranjeet Ranjan (@Ranjeet4India) September 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- bridge
- Kosi river
- people
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

