శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 18:34:08

క‌రోనాపై సమిష్టిగా విజ‌యం సాధించాం: కేజ్రివాల్‌

క‌రోనాపై సమిష్టిగా విజ‌యం సాధించాం: కేజ్రివాల్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ఆ ప్రాంత‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్ర‌జ‌లు, ఢిల్లీ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం క‌లిసి స‌మిష్టిగా విజయం సాధించామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే, క‌రోనాపై పోరు అప్పుడే ముగిసిపోలేదని కేజ్రివాల్‌ పేర్కొన్నారు. బురారీ ప్రాంతంలో 450 పడకలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్ప‌త్రి ప్రారంభోత్సవం సంద‌ర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

దేశ రాజధానిలో పరిస్థితులు కొంత‌ మెరుగుపడ్డాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గ‌త‌ నెలరోజులుగా కొవిడ్‌-19 కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని చెప్పారు. మరణాల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గాయన్నారు. అదే సమయంలో వైర‌స్ బారి నుంచి రికవరీ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కాగా, శుక్రవారం నాటికి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.28 లక్షలకు చేరగా.. అందులో యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,681గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo