Maoists | కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూన్ 18 : ఇన్ఫార్మర్ నెపంతో ముగ్గురిని హతమార్చి, 12 మందిని మావోయిస్టులు అపహరించిన సంగతి తెలిసిందే. అపహరించిన 12 మంది గ్రామస్తులను ఇవాళ ఉదయం విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని పెద్దకొర్మ గ్రామంలో లొంగిపోయిన మావోయిస్టు దినేష్ మడివి బంధువులైన ముగ్గురిని మంగళవారం సాయంత్రం పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. పెద్దకొర్మ గ్రామానికి చెందిన 12 మందిని మావోయిస్టులు అపహరించారు. ఇదిలా ఉండగా మావోయిస్టులు అపహరించుకు వెళ్ళిన గ్రామస్తులని బుధవారం ఉదయం విడుదల చేసినట్లుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారులు ధ్రువపరచాల్సి ఉంది.