అసోంలో ముస్లిం జనాభాపై తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజల మధ్య విభజన చిచ్చురేపేందుకు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. సీఎం శర్మ తప్పుడు సమాచారంతో ప్రజలను పక్కదారిపట్టిస్తున్నారు.
కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన ఈ మాదిరిగా వ్యవహరించలేదని, బీజేపీలో చేరినప్పటినుంచి ఆయనకు ఏమైందో తనకు అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. కాగా 1951లో అసోంలో 12 శాతంగా ఉన్న ముస్లింల జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరిందని సీఎం హిమంత శర్మ జులై 17న ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇది తనకు రాజకీయ అంశం కాదని, జీవన్మరణ సమస్యని సీఎం వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. సరైన ప్రక్రియను అనుసరించకుండానే అక్రమ వలసదారులు గిరిజన బాలికలను వివాహం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Sushmita Sen | నేను ఇప్పుడు రిలేషన్లో లేను : సుస్మితా సేన్