పట్నా: బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ విద్యార్థులకు సంఘీభావంగా పట్నాలోని గాంధీ మైదాన్‌లో గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 2న ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిమ్స్ దవాఖానకు తరలించారు.
नीतीश कुमार की कायरता देखिए, उनकी पुलिस ने पिछले 5 दिनों से ध्वस्त शिक्षा और भ्रष्ट परीक्षा के खिलाफ आमरण अनशन कर रहे प्रशांत किशोर को रात 4 बजे जबरन हिरासत में लिया। साथ में बैठे हजारों युवाओं को अज्ञात जगह पर ले गयी। pic.twitter.com/Ps1maDBkig
— Jan Suraaj (@jansuraajonline) January 5, 2025
పోలీసులతో వెళ్లేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించడంతో బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతోపాటు దీక్షా స్థలి వద్ద వేదికను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో గాంధీ మైదాన్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
#WATCH | Bihar | A clash broke out between Patna Police and supporters of Jan Suraaj chief Prashant Kishor
Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan, was detained by the police pic.twitter.com/AB3E1NNqRE
— ANI (@ANI) January 6, 2025
డిసెంబర్ 13న బీహార్‌లో నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ప్రశాంత్ కిశోర్ నాలుగు రోజుల క్రితం దీక్షకు దిగారు.
#WATCH | BPSC protest | Bihar: Patna Police detained Jan Suraaj chief Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan pic.twitter.com/JQ7Fm7wAoR
— ANI (@ANI) January 6, 2025
కాగా, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేసి ఉంది. కోట్ల విలువైన ఈ వాహనంలో ఇంటికి సంబంధించిన కిచెన్, బెడ్ రూమ్, ఏసీతో సహా అన్ని సౌకర్యాలున్నాయి. ఆ వ్యాన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన లగ్జరీ వాహనం నిరసన ప్రాంతం వద్ద ఉండటంపై అనుమానాలతోపాటు విమర్శలు వెల్లువెత్తాయి.