డీజిల్ అయిపోవడంతో ఆగిన అంబులెన్స్.. సకాలంలో చికిత్స అందక రోగి మృతి
టోల్ ప్లాజా సమీపంలో ఆ అంబులెన్స్ ఆగిపోయింది. ఏం అయ్యిందని రోగి బంధువులు డ్రైవర్‌ను అడగ్గా అంబులెన్స్‌లో డీజిల్ అయిపోయిందని చెప్పాడు. చేసేదేమీ లేక రోగి కుమార్తె, అల్లుడు కలిసి ఆ అంబులెన్స్‌ను సుమారు కిలోమీటరు దూరం వరకు తోశారు.
జైపూర్: డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఒక రోగి మరణించాడు. రాజస్థాన్‌లోని బాన్సువాడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల తేజ అనే వ్యక్తి దానాపూర్ గ్రామంలో ఉంటున్న కుమార్తె, అల్లుడు ఇంటికి వచ్చాడు. అతడు మూడు నెలలుగా అక్కడ ఉంటున్నాడు. అయితే గురువారం పొలంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కంగారుపడిన కుమార్తె, అల్లుడు వెంటనే ప్రభుత్వ అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడంతో బాన్సువాడా జిల్లా ఆసుపత్రికి అందులో తీసుకెళ్తున్నారు.
అయితే బాన్సువాడకు సుమారు పది కిలోమీటర్ల దూరంలోని రత్లాం రోడ్ టోల్ ప్లాజా సమీపంలో ఆ అంబులెన్స్ ఆగిపోయింది. ఏం అయ్యిందని రోగి బంధువులు డ్రైవర్‌ను అడగ్గా అంబులెన్స్‌లో డీజిల్ అయిపోయిందని చెప్పాడు. చేసేదేమీ లేక రోగి కుమార్తె, అల్లుడు కలిసి ఆ అంబులెన్స్‌ను సుమారు కిలోమీటరు దూరం వరకు తోశారు. ఇంతలో ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి రూ.500 విలువైన డీజిల్ కొని అంబులెన్స్ వద్దకు చేరుకున్నాడు. అంబులెన్స్‌లో డీజిల్ పోసినప్పటికీ అది ముందుకు కదలలేదు.
మరోవైపు మరో అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అది వచ్చి ఆ రోగిని అందులో తీసుకెళ్లే సరికి గంటకుపైగా సమయం గడిచింది. ప్రభుత్వ ఆసుపత్రికి చేరిన రోగిని పరిశీలించిన వైద్యులు అతడు చనిపోయినట్లు చెప్పారు. దీంతో రాజస్థాన్‌లో వైద్య సౌకర్యాల దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

