హైదరాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఆందోళన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రతికూల వాతావరణంలో ఎయిర్ ఇండియా విమానానాన్ని అధికారులు నిలిపివేశారు. దీంతో మూడు గంటలుగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు పడుతున్నారు. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదంటూ ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. వాతావరణం అనుకూలించాక పంపిస్తామని సిబ్బంది పేర్కొన్నారు.