కిక్కిరిసిన రైళ్లు | యూపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఉద్యోగార్థుల పాలిట శాపం
UP PET-2022: ఉత్తరప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు నిర్లక్ష్యం ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారింది. ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర
లక్నో: ఉత్తరప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు నిర్లక్ష్యం ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారింది. ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష (UPSSSC PET or UP PET-2022) నిర్వహించిన ప్రభుత్వం.. అభ్యర్థులకు సరైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఇది ఉద్యోగార్థులు, ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. వేరే రవాణా సదుపాయాలు లేకపోవడంతో యూపీ పెట్-2022 అభ్యర్థులంతా రైళ్లను ఆశ్రయించారు.
దాంతో ప్రతి రైలులో బోగీలన్నీ కిక్కిరిసిపోయాయి. రద్దీ రైళ్లను ఎక్కలేక, దిగలేక పరీక్షార్థులు, ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. పైగా మితిమీరిన రద్దీవల్ల రైళ్లు మరింత ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. వందల మంది అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దాంతో చాలామంది అభ్యర్థులు పరీక్ష రాయకుండానే ఇండ్లకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
కాగా, ప్రభుత్వం సరైన రవాణా సౌకర్యాలు కల్పించకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజూ కాలేజీలకు వెళ్లేందుకే రద్దీ కారణంగా గంటల తరబడి రైల్వే స్టేషన్లలో నిలబడాల్సి వస్తుందని, అలాంటిది ఇవాళ పరీక్ష ఉన్నా పాలకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. రైళ్లు సరిగా లేక రోజూ ప్రయాణికులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నా.. ముఖ్యమంత్రి మాత్రం తన ర్యాలీలకు రైళ్లను తీసుకెళ్తారని వారు మండిపడ్డారు.
#WATCH | Uttar Pradesh: Passengers crammed into jam-packed railway coaches in Moradabad amid a massive rush of UP PET 2022 exam candidates returning from their exam centres to their homes pic.twitter.com/i8OZG2x3tW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

