తాండూర్ : ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ( KCR ) ప్రభుత్వం అధికారంలోకి రావాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ( Durgam Chinnaiah ) తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు( CPI Leaders ) , 50 మందికి పైగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేశారు.

పార్టీలో చేరివారిలో మాదారం గ్రామపంచాయతీ కి చెందిన సీపీఐ నాయకులు మలిశెట్టి సత్యనారాయణ, ఆరేపెల్లి శశికుమార్ , యూత్ సభ్యులు భీముడు, చరణ్, సౌమ్య, యూత్ సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.