రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఓ బస్సు శనివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిలో ప్రయాణిస్తున్న 45 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రాంచీ నుంచి ఛాట్రాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మందర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి మనోజ్ కర్మలి మాట్లాడుతూ, సకాలంలో బస్సును ఆపడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారన్నారు.