పాట్నా: గత కొన్ని రోజులుగా రైళ్లలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒక ప్యాసింజర్ రైలులో ఫైర్ ఎక్సిడెంట్ జరిగింది. ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఆ బోగి మంటల్లో పూర్తిగా కాలిపోయింది. (Train Catches Fire) బీహార్‌లోని ససారం రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ససారం-పాట్నా ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ససారం రైల్వే స్టేషన్‌లోని ఆరో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై నిలిచి ఉన్నది. ఉన్నట్టుండి ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు.
కాగా, రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆ కోచ్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. దీంతో కాలిన బోగిని రైలు నుంచి వేరు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే రైలు కోచ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే రైలు కోచ్ నుంచి మంటలు ఎగసిపడిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Sasaram, Bihar – A major fire broke out in one of the passenger coaches of the Patna Fast Passenger Train at Sasaram railway station on Platform No. 6, completely gutting the coach in a dramatic incident that could have turned tragic pic.twitter.com/9A2Nt4Yzfp
— NextMinute News (@nextminutenews7) May 18, 2026