మంగళవారం 26 జనవరి 2021
National - Dec 28, 2020 , 16:36:03

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో మంచు వ‌ర్షం

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో మంచు వ‌ర్షం

సిమ్లా: దేశంలో చ‌లి తీవ్ర‌త రోజురోజుకు పెరుగుతున్న‌ది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు అత్యంత త‌క్కువ‌కు ప‌త‌న‌మ‌వుతుండ‌గా, ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఏకంగా మైన‌స్ డిగ్రీల్లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదువుతున్నాయి. హిమాల‌య ప‌ర్వ‌తాల నుంచి వీస్తున్న శీత‌ల గాలుల కార‌ణంగా జ‌మ్ముక‌శ్మీర్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో గ‌త రెండు మూడు రోజుల నుంచి విప‌రీతంగా మంచు కురు‌స్తున్న‌ది.

సిమ్లా జిల్లాలోని ఖారాప‌త్త‌ర్‌, కిన్నౌర్ జిల్లాలోని క‌ల్ప ఏరియాల్లో ఈ తెల్ల‌వారుజామున భారీగా మంచు కురిసింది. దాంతో ఆయా ప్రాంతాల్లోని ఇండ్ల పైక‌ప్పులపై భారీగా మంచు పేరుకుపోయింది. ఇండ్ల ముందు నిలిపిన వాహ‌నాలు కూడా పూర్తిగా మంచులో కూరుకుపోయాయి.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo