నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా 16 కొత్త బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. వాటిలో బయోలాజికల్ డైవర్సిటీ, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు, నేషనల్ డెంటల్ కమిషన్, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ బిల్లు, కోస్టల్ ఆక్వాకల్చర్ బిల్లు, అటవీ సంరక్షణ చట్ట సవరణ వంటి బిల్లులు ఉన్నాయి.
కాగా, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఈడబ్ల్యూఎస్ కోటా, రూపాయి మారకపు విలువ పతనం, ఇండో-చైనా సరిహద్దు సమస్య, అధిక జీఎస్టీ పన్నుల వంటి అంశాలపై పార్లమెంట్లో చర్చించాల్సిందేనని అఖిలపక్షాలు పట్టుబడుతున్నాయి.
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భావసారూప్యం కలిగిన పార్టీలు నేడు సమావేశం కానున్నాయి. కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు, రాజసభా పక్ష నేత మల్లికార్జున ఖర్జే చాంబర్లో ఉదయం 9.45 గంటలకు ఈ భేటీ జరుగనుంది.

ఇక ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ ఎన్నికైన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు ఇవే కావడంతో.. ఆయన తొలిసారిగా రాజ్యసభ చైర్మన్‌గా సభా కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ గౌరవార్ధం రాజ్యసభలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Congress
- lok sabha
- Parliament
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

