న్యూఢిల్లీ, మార్చి 30 : కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎన్నో ఏండ్లుగా తిష్ఠ వేసి ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. ‘ఒకే మంత్రిత్వ శాఖలో చాలా సంవత్సరాలుగా కొందరు అధికారులు పాతుకుపోయి ఉండటం వల్ల అది అవినీతి, అక్రమాలకు దారి తీసే అవకాశం ఉంది. నిర్దేశిత సమయాన్ని మించి ఏ అధికారిని కూడా అక్కడ ఉంచకుండా తగిన చర్యలు చేపట్టాలి’ అని ప్యానెల్ సూచించింది.