న్యూఢిల్లీ : సభా సమావేశాల్ని అడ్డుకుంటే నష్టపోయేది ఎంపీలేనని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రభసకు, నాటకీయతకు పాల్పడే పార్టీల నాయకుల వల్ల పార్లమెంట్ సభ్యులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. సభను అడ్డుకోవాలన్న తమ నాయకుల ఆదేశాలను ప్రతిఘటించాలని ఆయన యువ ఎంపీలకు సూచించారు.
శనివారం కర్ణాటక హైకోర్టుకు చెందిన న్యాయవాదులనుద్దేశించి రిజిజు ప్రసంగించారు. సమావేశాలను అడ్డుకోవడం వల్ల నష్టపోయేది ఎంపీలే తప్ప ప్రభుత్వం కాదని, అవసరమైన బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకుంటుందని అన్నారు.