న్యూఢిల్లీ, నవంబర్ 5: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ఈ నెల 26న ప్రత్యేక వేడుకలు జరపనున్నట్టు చెప్పారు.
గత పార్లమెంట్ సమావేశంలో విధించిన గడువు మేరకు వక్ఫ్ సవరణ బిల్లుపై వేసిన జాయింట్ కమిటీ ఈ నెల 29న పార్లమెంట్లో తుది నివేదికను సమర్పించవచ్చునని భావిస్తున్నారు.