Speaker Om Birla : పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల్లో తొలి రెండు రోజులు ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ఉభయసభల సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. మంగళవారం కూడా ముందుగా వందేమాతరం (Vandematharam) పై చర్చకు ప్రభుత్వం పూనుకోగా.. SIRపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
తీవ్ర గందరగోళం కారణంగా లోక్‌సభ రేపటికి వాయిదాపడింది. ఇకముందు కూడా ఉభయసభలు సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో స్పీకర్ ఓంబిర్లా విపక్ష పార్టీల శాసనసభాపక్ష నేతలతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ హౌస్‌లోని స్పీకర్ చాంబర్లో ఈ సమావేశం జరుగనున్నట్లు సమాచారం.