న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌కు కుప్పలు తెప్పలుగా ప్రతిస్పందనలు వచ్చిపడ్డాయి. బీజేపీ నేత జగదాంబికాపాల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్యానెల్ ఏకంగా 1.2 కోట్ల ఈ-మెయిల్స్ అందుకుంది. వక్ఫ్ సవరణ బిల్లుపై సలహాలు తెలియజేయాలంటూ కమిటీ గత నెలలో కోరింది.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తమ ప్రతిస్పందనలు పంపాలంటూ ప్రముఖ ఇస్లామిక్ బోధకుడు జకీర్‌నాయక్ తన మద్దతుదారులను కోరారు. బిల్లుకు అనుకూలంగా తమ స్పందనలు పంపాలని పలు హిందూ సంఘాలు కొరడంతో ఇబ్బడిముబ్బడిగా ఈ-మెయిల్స్ వచ్చిపడ్డాయి.