Civils | సివిల్స్ ఎంపిక ప్రక్రియకు 15 నెలలా.. ఆర్నెల్లలోగా రిక్రూట్మెంట్ పూర్తిచేయాలి: పార్లమెంట్ కమిటీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. సుదీర్ఘకాలం సాగుతున్న ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, కాల వ్యవధిని వీలైనంత మేరకు తగ్గించాలని యూపీఎస్సీని పార్లమెంట్ కమిటీ కోరింది.
2022-23లో 32.19 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 16.82 లక్షల (51.95శాతం) మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారని, అభ్యర్థుల హాజరు తక్కువ ఉండటానికి కారణం సుదీర్ఘకాలం పాటు సాగిన ఎంపిక ప్రక్రియేనని కమిటీ నివేదిక పేర్కొంది. ప్రస్తుత సివిల్స్ ఎంపిక విధానం ఇంగ్లిష్, నాన్-ఇంగ్లిష్ అభ్యర్థులకు సమాన అవకాశం కల్పిస్తుందా? లేదా? అన్నది అంచనా వేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుచేయాలని సూచించింది. ప్రిలిమినరీ పరీక్షల కీ విడుదల చేయాలని, వాటిపై అభ్యర్థుల ఫిర్యాదులు స్వీకరించాలని సూచించింది. ఉద్యోగ నియామక ప్రకియ పూర్తికి ఆరు నెలలకు మించి సమయం తీసుకోరాదని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

