అదానీ సంగతేంటి?
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ గ్రూపు అక్రమాలపై హిండెన్‌బర్గ్ నివేదిక తేల్చిన అంశాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాల్సిందేనని ఎంపీలు డిమాండ్ చేశారు.
- ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సిందే
- జేపీసీ నియమించి విచారణ జరిపించాల్సిందే
- పార్లమెంట్లో బీఆర్ఎస్ సహా విపక్షాల ఆందోళన
- ఎర్రకోట వద్ద ర్యాలీని అడ్డుకొన్న ఢిల్లీ పొలీసులు
- ఎంపీల అరెస్టు.. అనంతరం వాహనాల్లో తరలింపు
- నిరంకుశ బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి
- బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు మండిపాటు
- రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం: నామా
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ గ్రూపు అక్రమాలపై హిండెన్‌బర్గ్ నివేదిక తేల్చిన అంశాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాల్సిందేనని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘మోదీ-అదానీ భాయ్ భాయ్’ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. ‘సేవ్ డెమోక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నల్ల అంగీలు ధరించి నిరసన తెలిపారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో స్పీకర్ చైర్ వైపుగా పేపర్లు, నల్ల కండువాలు విసిరారు. రాహుల్‌పై అనర్హత వేటును ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీకి అడ్డంకులు
కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు విపక్ష ఎంపీలు మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నుంచి టౌన్ హాల్ వరకు నిర్వహించ తలపెట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు. పెద్దయెత్తున భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు భారీ సంఖ్యలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మార్చ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీలను అడ్డుకొన్న పోలీసులు.. వారిని ఎర్రకోట వద్దకు పోనివ్వకుండా ఆపేశారు. అడ్డుకొన్న చోటు నుంచే ర్యాలీ చేపట్టేందుకు ఎంపీలు ప్రయత్నించగా.. 144 సెక్షన్ అమల్లో ఉన్నదని పేర్కొంటూ ముందుకు పోనివ్వలేదు. అనంతరం పలువురు ఎంపీలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసు వాహనాల్లో వేరే చోటుకి తరలించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రం ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ ‘నియంత భయం చూడండి’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘అదానీ అంశాన్ని లేవనెత్తితే పార్లమెంట్‌ను వాయిదా వేస్తారు.. రోడ్లపై ఆందోళనకు దిగితే పోలీసులను పంపిస్తారు’ అని విమర్శించింది.
తీరు మారకుంటే ఉధృతంగా ఆందోళనలు
ఎర్రకోట వద్ద విపక్షాల ర్యాలీని అడ్డుకోవడంపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన ర్యాలీ చేస్తుంటే అడ్డుకుంటున్నారని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు మారకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొన్న కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు లొంగని, బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే, విమర్శించే పార్టీలు, నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు. ప్రజలు సమస్యలను పక్కదారి పట్టించడానికి బీజేపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. పార్లమెంట్ నడవకుండా వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నదని ఆక్షేపించారు. ర్యాలీలో బీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, కేఆర్ సురేశ్ రెడ్డి, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- adani
- BJP
- BRS
- MP Keshava Rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

