నేషనల్ హైవేలపై పార్కింగ్ నిషేధం
దేశ వ్యాప్తంగా రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు సుప్రీంకోర్టు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో జాతీయ రహదారులపైన భారీ వాహనాల పార్కింగ్ నిషేధం, రోడ్డు పక్కన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు వంటివి ఉన్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశ వ్యాప్తంగా రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు సుప్రీంకోర్టు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో జాతీయ రహదారులపైన భారీ వాహనాల పార్కింగ్ నిషేధం, రోడ్డు పక్కన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు వంటివి ఉన్నాయి. నివారించగ్గ రోడ్డు ప్రమాద మరణాలు జీవించే హక్కును ఉల్లంఘిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.
నిర్దిష్ట కాలపరిమితి లోగా చర్యలు తీసుకోవాలని అధికారులను సుప్రీంకోర్టు శనివారం ఆదేశించింది. దేశంలోని మొత్తం రోడ్ల పొడవులో కేవలం 2 శాతం మాత్రమే ఉన్న నేషనల్ హైవేలు అన్ని రోడ్డు మరణాల్లో మాత్రం దాదాపు 30 శాతానికి కారణమవుతున్నాయని జస్టిస్ జేకే మహిశ్వేరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అక్రమ పార్కింగ్ లేదా బ్లాక్స్పాట్లు వంటి నివారించదగిన ప్రమాదాల కారణంగా ఒక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వ రక్షణ ఛత్రం విఫలమైనట్టేనని కోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ, జాతీయ రహదారుల సంస్థ, రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర పోలీసులు, రవాణా శాఖల అధికారులు 60 రోజుల్లోగా ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. నేషనల్ హైవేలకు చెందిన రైట్ ఆఫ్ వే(ఆర్వోడబ్ల్యూ) పరిధిలో కొత్త వాణిజ్య నిర్మాణాల నిర్మాణం లేదా కార్యకలాపాలను కూడా కోర్టు నిషేధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

