ముంబై: రామాయణంలోని శ్రవణ కుమారుడు నాడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని తీర్థయాత్రలకు తీసుకువెళితే నేటి కుమారులు వృద్ధులైన తల్లిదండ్రులను కోర్టుకీడుస్తున్నారని (Court) బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. తన తల్లిదండ్రులు వైద్య చికిత్స కోసం వచ్చినప్పుడు గోరెగావ్ శివారులోని తన ఇంటిని ఉపయోగించకుండా నిరోధించాలని కోరిన ఒక వ్యక్తి విజ్ఞప్తిని జస్టిస్ జితేంద్ర జైన్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.
తన తల్లిదండ్రులు తన గృహాన్ని వినియోగించకుండా చూడాలంటూ ఆ వ్యక్తి 2018లో దాఖలు చేసిన పిటిషన్ను సివిల్ కోర్టు తిరస్కరించింది. దానిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఉపశమనం కలిగించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కాలం పిల్లల పెంపకంలో ఏదో తీవ్ర సమస్య ఉందని పేర్కొంది.