న్యూఢిల్లీ: పారాసిటమాల్ మాత్రలను దీర్ఘకాలం వాడటం వల్ల వృద్ధుల గుండె, మూత్రపిండాలు, నోరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, మలద్వారం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో ఈ అంశాలు తెలిశాయి.
పారాసిటమాల్ వాడకం వల్ల జీర్ణాశయంలో అల్సర్ కారణంగా జరిగే రక్తస్రావం ముప్పు 24 శాతం, లోయర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్ 36 శాతం అదే విధంగా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి 19 శాతం, హార్ట్ ఫెయిల్యూర్ 9 శాతం పెరగవచ్చు.