బుధవారం 03 జూన్ 2020
National - Apr 06, 2020 , 14:30:00

పేదలకోసం జనతా కిచెన్‌ ప్రారంభించిన అథ్లెట్‌ దీపా మాలిక్‌

పేదలకోసం జనతా కిచెన్‌ ప్రారంభించిన అథ్లెట్‌ దీపా మాలిక్‌

క్రీడా రంగంలో భారతదేశం కోసం అనేక పురస్కారాలను పొందిన పారా-అథ్లెట్ దీపా మాలిక్ ఇటీవల కాన్పూర్ నగరంలో రోజువారీ కూలీలకు ఆహారాన్ని పంపిణీ చేయడానికి హ్యాపీ జనతా కిచెన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. షాట్ పుట్‌లో 2016 సమ్మర్ పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళా పారాప్లెజిక్ అథ్లెట్, వీలింగ్ హ్యాపీనెస్ అనే ఎన్జీఓను నడుపుతోంది.

 తన కుమార్తె దేవికాతో పాటు నార్త్ ఇండియా నగరాలైన నోయిడా, అమేథికి కూడా విస్తరించాలని అనుకుంటుంది. దీనికోసం ఎన్జీఓ శివశక్తి కృపతో జతకట్టారు. రోజూ 100 మందికి భోజనం పంపిణీ  చేస్తున్నారు.  ఇప్పటికే 500 మందికి భోజనాలు పంపిణీ చేశారు. 26 కుటుంబాలకు ఎసెన్షియల్స్అండ్‌ క్యాష్-ఇన్-హ్యాండ్ తో మద్దతు ఇస్తున్నారు. వీలింగ్ హ్యాపీనెస్ ఫౌండేషన్ అండ్‌ ఎస్ఎస్కెఎఫ్ ఈ ప్రయత్నానికి దయచేసి సహకరించండంటూ కోరుతున్నారు. అంతేకాదు 21 రోజులు లాక్‌డౌన్‌లో 100 మంది రోజువారీ కూలీల‌కు ఆహారం ఇవ్వ‌డానికి  కూడా దేవికా సదుపాయాలు క‌ల్పిస్తున్న‌ది. అందుకు  త‌ల్లి దీపా ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్న‌ది.  భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా వ్యవహరించే మాలిక్, లాక్డౌన్ దృష్ట్యా అన్ని జాతీయ, రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లను ఏప్రిల్ 15 వరకు నిలిపివేశారు.


logo