జేవోఏ-ఐటీ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్) పేపర్ మాత్రమే కాదు, హిమాచల్ ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (హెచ్‌పీఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన 30 ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆ రాష్ట్ర డీఐజీ (విజిలెన్స్) శివకుమార్ ఆదివారం మీడియాకు వెల్లడించారు.
న్యూఢిల్లీ: జేవోఏ-ఐటీ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్) పేపర్ మాత్రమే కాదు, హిమాచల్ ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (హెచ్‌పీఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన 30 ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆ రాష్ట్ర డీఐజీ (విజిలెన్స్) శివకుమార్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. గత పరీక్షల పేపర్లు కూడా లీక్ అయినట్టు కమిషన్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. దీంతో మునుపటి బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేపర్ లీకేజ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. జేవోఏ-ఐటీ పేపర్ లీకేజ్ స్కాం గత ఏడాది డిసెంబర్ 23న బయటపడింది. రూ.2.5 లక్షలకు సమాధాన పత్రాన్ని అమ్ముతుండగా హెచ్‌పీఎస్‌ఎస్‌సీ సీనియర్ అసిస్టెంట్ ఉమా ఆజాదీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కమిషన్ కార్యకలాపాల్ని హిమాచల్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఉద్యోగ పరీక్షలన్నీ తిరిగి నిర్వహిస్తామని తెలిపింది.