దారుణం : గ్రామసభలో రైతుపై పంచాయతీ అధికారి దాడి
తమిళనాడులో దారుణ ఘటన కలకలం రేపింది. రాష్ట్రంలోని పిల్లయర్కులం గ్రామంలో గ్రామ సభ వేదికగా పంచాయతీ అధికారి రైతుపై దాడిచేశాడు.
చెన్నై : తమిళనాడులో దారుణ ఘటన కలకలం రేపింది. రాష్ట్రంలోని పిల్లయర్కులం గ్రామంలో గ్రామ సభ వేదికగా పంచాయతీ అధికారి రైతుపై దాడిచేశాడు. రైతును కొట్టిన పంచాయతీ అధికారిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఎమ్మెల్యే మన్రాజ్ సమక్షంలో అవినీతి కేసులో అధికారుల నిర్లక్ష్యంపై రైతు అమ్మియప్పన్ ప్రశ్నించంగా పంచాయతీ కార్యదర్శి తంగపాండియన్ ఆయన అనుచరులు రైతుపై దాడికి తెగబడ్డారు.
గ్రామ సభను రొటేషన్ పద్ధతిలో వివిధ గ్రామాల్లో నిర్వహించాల్సి ఉండగా, అలా చేయడం లేదని వెప్పంకులం గ్రామానికి చెందిన రైతు అమ్మియప్పన్ ప్రశ్నించారు. గ్రామసభను పలుమార్లు ఒకే గ్రామంలో నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశాడు.
అవినీతి ఆరోపణలపై పంచాయతీ కార్యదర్శి తంగపాండియన్‌పై ఏం చర్యలు చేపట్టారని ప్రశ్నించగా కోపోద్రిక్తుడైన తంగపాండియన్ అమ్మియప్పన్ ఛాతీపై కాలితో తన్నాడు. తంగపాండియన్ అనుచరులు కూడా రైతును కొట్టారు. ఈ ఘటనతో గ్రామసభ రసాభాసగా ముగిసింది. రైతు అమ్మియప్పన్ ఫిర్యాదు ఆధారంగా తంగపాండియన్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More :
Murder | లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

