Jammu and Kashmir | సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ పాక్.. ధీటుగా జవాబిచ్చిన భారత్
Jammu and Kashmir : దాయాది దేశం పాకిస్తాన్.. భారత సరిహద్దులో కాల్పులకు పాల్పడింది. మంగళవారం రాత్రి పాక్ దళాలు.. భారత సరిహద్దుపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాయి. వెంటనే అప్రమత్తమైన భారత దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో పాక్ తోక ముడిచింది.
Jammu and Kashmir : దాయాది దేశం పాకిస్తాన్.. భారత సరిహద్దులో కాల్పులకు పాల్పడింది. మంగళవారం రాత్రి పాక్ దళాలు.. భారత సరిహద్దుపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాయి. వెంటనే అప్రమత్తమైన భారత దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో పాక్ తోక ముడిచింది. ఈ ఘటన కాశ్మీర్ ప్రాంతం, కుప్వారా జిల్లా, కేరన్ సెక్టార్లో జరిగింది.
ఈ సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత పెంచేందుకు 6 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సిబ్బంది రాత్రిపూట హై టెక్నాలజీ సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. శత్రువులు చొచ్చుకొచ్చే వీలున్న కొన్ని బ్లైండ్ స్పాట్స్ లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి సామగ్రి తరలించి, వాటిని అమరుస్తుండగా పాక్ సైన్యం తేలికపాటి ఆయుధాలతో రెండు రౌండ్ల కాల్పులు జరిపింది. సీసీ కెమెరాలు అమర్చే పనుల్ని అడ్డుకునే ఉద్దేశంతో పాక్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. అయితే, వెంటనే భారత భద్రతా బలగాలు ధీటుగా స్పందించాయి. పాక్ వైపు సింగిల్ షాట్స్ కాల్పులకు దిగింది మన సైన్యం. దీంతో పాకిస్తాన్ ఆర్మీ ఆగిపోయింది.
కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని రక్షణ అధికారులు తెలిపారు. మరోవైపు ఇది చాలా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో సైన్యం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. మన సైన్యం దృష్టి మళ్లించేందుకే పాక్ ఈ కాల్పులు జరిపిందా అనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతాన్ని సైన్యం పూర్తిగా గాలిస్తోంది. పైగా.. రాబోయే రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- Jammu and Kashmir
- Keran
- loc
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

