న్యూఢిల్లీ, జనవరి 10: జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి ముందు జమ్మూలో హింస చెలరేగవచ్చని వార్తలు వచ్చిన నేపథ్యంలో సంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో శనివారం కొన్ని ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
వీటిని పాకిస్థానీ డ్రోన్ చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన తరుణంలో ఆయుధాల స్వాధీనం జరిగింది.