మంగళవారం 19 జనవరి 2021
National - Dec 18, 2020 , 21:14:58

మరోసారి భారత్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌ ఎత్తు.. పాక్‌ మంత్రి

మరోసారి భారత్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌ ఎత్తు.. పాక్‌ మంత్రి

ఇస్లామాబాద్‌: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ మరోసారి తన ద్వేషాన్ని బయటపెట్టుకుంది. విషం చిమ్మడానికి తెగబడింది. పాకిస్థాన్‌ కార్మికులపై నిషేధం విధించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ).. భారతీయులను మాత్రం అనుమతినిస్తున్నది. ఈ నేపథ్యంలో యూఏఈలో పర్యటిస్తున్న పాక్‌ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశారు.  

‘భారత్‌ తన అంతర్గత వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది’ అని ఖురేషి అన్నారు. తమ నిఘా వర్గాల నుంచి తమకు అందిన సమాచారం ప్రకారం పాక్‌పై భారత్‌ సర్టికల్‌ స్ట్రయిక్‌కు ప్రణాళిక సిద్ధం చేసిందని ఆయన అన్నట్లు పాక్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. 

కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, దౌత్య విధానాల్లో మార్పులు వచ్చాయి. పలు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  ఇందులో భాగంగా గత నెల 18న యూఏఈ జాతీయ భద్రత పరిరక్షణ కోసం 13 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించింది. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, సిరియా, సోమాలియా, ఇరాక్‌, యెమెన్‌ తదితర దేశాలు ఉన్నాయి. సౌదీ వ్యతిరేక బ్లాక్‌ దేశాల పౌరులపై యూఏఈ నిషేధం విధించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.