Airspace Close | పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్ దాడులు పాల్పడుతోందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ శనివారం తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌మెన్‌కు నోటీసు (NOTAM) జారీ చేసింది. శనివారం తెల్లవారు జామున 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నిరకాల విమానాలకు గగనంతలం మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ పౌర విమానయాన అథారిటీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ తన గగనతలాన్ని తెరిచి ఉంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిందని ఆరోపించింది. కరాచీ, లాహోర్ మధ్య విమానాలు తిరుగుతూనే ఉన్నా.. ఎయిర్ స్పేస్ మూసేశామని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మరో వైపు ఎల్వోసీ వెంట కాల్పులు జరుపుతోందని.. ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తూనే లేదంటూ అబద్ధాలను వల్లెవేస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధ్వజమెత్తారు.
గురుద్వారాలు, ఆలయాలు, పాఠశాలలే లక్ష్యంగా పాక్ దాడులు తెగబడుతోందని.. మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విక్రమ్ మిస్రీ మండిపడ్డారు. భారత నగరాలపై విఫల డ్రోన్, మిస్సైల్ దాడులు చేస్తున్న పాకిస్తాన్.. తన ఎయిర్ స్పేస్‌నూ మూసేయడాన్ని మానేసిందని.. భారతదేశ దళాలు బలంగా స్పందిస్తాయని పూర్తిగా తెలిసినప్పటికీ, పౌర విమానాలను రక్షణ కవచంగా ఉపయోగించుకోవడం స్పష్టంగా తెలుస్తుందని.. ఇది ప్రమాదకరమైన వ్యూహంగా కనిపిస్తోందన్నారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో విమానాలు ఎగురడం సురక్షితం కాదని కర్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు. పాకిస్తాన్ భారతీయ నగరాలపై 300 నుంచి 400 డ్రోన్లతో దాడికి పాల్పడిందని.. బరాక్-8, ఎస్-400, ఆకాశ్ ఎస్ఏఎం విజయవంతంగా డ్రోన్లు, మిస్సైల్స్‌ని కూల్చివేశాయని తెలిపారు. పాక్ దాడులను భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టిందని వివరించారు.