న్యూఢిల్లీ, జులై 6: పాకిస్థాన్ అణ్వస్ర్తాలు అమెరికా సైన్యం నియంత్రణలో ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే అమెరికా పట్ల భారత్ తన వైఖరిని ఇటీవలి కాలంలో మార్చుకోవాల్సి వచ్చిందని ఆయన ఓ వైరల్ వీడియోలో వెల్లడించారు. పాకిస్థాన్లో సీఐఏ ఉగ్రవాద నిరోధక అధికారిగా గతంలో పనిచేసిన కిరియాకోవ్ మాట్లాడుతూ పాకిస్థాన్ అణ్వాయుధాలు అమెరికన్ జనరల్ కమాండ్, కంట్రోల్లోపాక్ ప్రభుత్వం పెట్టిందని చెప్పారు.
దీని వల్ల దక్షిణాసియా ప్రాంతంలో అణు ముప్పు గణనీయంగా తగ్గిపోయిందని, ఈ కారణంగానే భారత్ పాక్తో ఘర్షణల కొనసాగింపు విషయంలో వెనుకడుగు వేసి ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ వద్ద 170 అణు బాంబులు ఉన్నాయని అంచనా.