న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రదాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. స్వయంగా ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆధ్వర్యంలో భారత్‌పై ఉగ్ర దాడులకు ఎస్ 1 అనే రహస్య యూనిట్ పనిచేస్తున్నదంటే ఆశ్చర్యం కలుగుతుంది. తగిన శిక్షణ ఇచ్చి ఉగ్రవాదులను భారత్‌కు పంపేందుకే ఈ యూనిట్ ఏర్పడింది.
1983 ముంబై పేలుళ్ల దగ్గర నుంచి తాజాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వరకు ఈ యూనిట్టే ప్రధాన పాత్ర పోషించిందని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయని ఎన్డీటీవీ వెల్లడించింది.