జమ్ము: వరుసగా ఏడో రోజూ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లోని పలు సెక్టార్ల వద్ద రాత్రివేళ కాల్పులు జరిపింది. భారత సైన్యం ఇందుకు దీటుగా స్పందించిందని ఆర్మీ అధికారులు గురువారం తెలిపారు.
ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ మంగళవారం హాట్లైన్లో కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని చర్చించినా పాక్ దాన్ని ఉల్లంఘించింది. కుప్వారా, బారాముల్లా, ఉత్తర కశ్మీర్ జిల్లాల్లో చిన్న చిన్న ఆయుధాలతో పాక్ కాల్పులకు తెగ బడుతున్నది.