న్యూఢిల్లీ, ఆగస్టు 7: లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఏడుగురు ఎంపీలకు ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ తమ దేశంలో పండిన మామిడి పండ్లను బుధవారం అందజేసింది.
రాహుల్‌తోపాటు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సమాజ్‌వాదీ ఎంపీలు మొహిబ్బుల్లాహ్ నద్వి, జియా ఉర్ రెహమాన్ బార్గ్, కైరానా ఇక్రా హసన్, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీకి కూడా పాక్ హైకమిషన్ మామిడిపండ్లను అందజేసింది.