న్యూఢిల్లీ: భారత్‌పై పాక్ ఆర్మీ మరో అధికారి నోరు పారేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. పాకిస్థాన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రి మాట్లాడుతూ భారత్ తమ వాటా నీటిని నిలిపివేస్తే.. కచ్చితంగా ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం అంటూ మాట్లాడారు. అయితే పహాల్గాం దాడి తర్వాత భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తున్నది.
ఈ వ్యాఖ్యలు గతంలో లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయిద్ ప్రసంగాన్ని పోలి ఉన్నాయి. ‘మీరు నీటిని నిలిపివేస్తే.. దేవుడి సాక్షిగా మీ శ్వాసను ఆపేస్తాం.. అదే నదుల్లో మీ రక్తాన్ని ప్రవహించేలా చేస్తాం’ అంటూ మాట్లాడారు. ఈ రెండు ప్రసంగాల వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక ఆన్లైన్ డిబేట్లో అఫ్గాన్‌కు చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ ఎంపీ మరియం సొలైమంకి మాట్లాడుతూ పాకిస్థాన్ ఆర్మీ అధికారి మాటలు, ఉగ్రవాద సంస్థల స్క్రిప్ట్‌తో పోలి ఉన్నాయని తెలిపారు.