ఇప్పటి వరకూ జమ్మూలో జరిగిన అన్ని సంఘటనలకూ పాకిస్తాన్ ఉగ్రవాదులే బాధ్యులని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. పాక్ ఉగ్రవాదుల వల్ల హిందువులు, కశ్మీరీ పండితులు, కశ్మీర్ ముస్లింలు.. ఇలా అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.జమ్మూలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కులం, మతంతో సహా ఇతరత్రా అంశాల మీద సమాజాన్ని విభజించాలని రాజకీయ పార్టీలు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటూనే వుంటాయన్నారు.
అయితే తాను ఏ పార్టీనీ ఉద్దేశించి అనడం లేదని, సమాజం కలిసికట్టుగా ఉండాలన్నదే తమ భావన అని అన్నారు. మహాత్మ గాంధీయే అందరి కంటే పెద్ద హిందువు అని గులాంనబీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ఓ సెక్యులరిస్టు అని కూడా అన్నారు. పరమహత సహనం కలిగిన వ్యక్తి గాంధీ అని గులాంనబీ పేర్కొన్నారు.