PAK Foreign Minister : భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అంశంపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) స్పందించారు. దాయాదుల మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అంటూ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను దార్ కొట్టిపారేశారు. అంతేకాదు కాల్పల విరమణలో ట్రంప్ సహ మధ్యవర్తుల జోక్యాన్ని భారత్ అంగీకరించలేదని అల్ జజీర వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
ఇటీవల ఇరుదేశాల మధ్య ఉద్రికత్తలు తలెత్తినప్పుడు భారత్తో చర్చలకు మేము ప్రయత్నించాం. కానీ, ఢిల్లీ నుంచి మాకు సమాధానం రాలేదు. పైగా ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏమాత్రం అంగీకరించలేదు అని దార్ పేర్కొన్నారు. అల్ జజీర ఇంటర్వ్యూలో భారత్తో ఏమైనా చర్చలు జరిపారా? కాల్పుల విరమణలో మూడో వ్యక్తి దేశం ప్రమేయం ఉందా? మధ్యవర్తత్వం కోసం ఎదురు చూశారా? వంటి ప్రశ్నలు పాక్ విదేశాంగ శాఖ మంత్రికి ఎదురయ్యాయి.
🚨Big Confession By Pakistan!
Pakistan’s Foreign Minister Ishaq Dar says India had denied any 3rd party mediation with Pakistan.
When Pak asked US Secretary of State Marco Rubio about 3rd party mediation with India as Trump claims, Rubio denied saying India says it’s “Bilateral… pic.twitter.com/77PvyfbSK1
— Ankur Singh (@iAnkurSingh) September 16, 2025
అప్పుడు ఆయన.. ‘మాకు మూడో వ్యక్తి దేశం జోక్యం చేసుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ, భారత్ మాత్రం సుతారమూ అంగీకరించలేదు. దైపాక్షిక సమస్య కాబట్టి మనమే పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ, మేము అలా భావించలేదు. మా మధ్య ఉగ్రవాదం, వ్యాపారం, ఆర్ధిక అంశాలు, జమ్ముకశ్మీర్. వంటి ఇంతకు ముందు చర్చించిన ఈ అంశాల గురించి మాట్లాడుకున్నాం’ అని దార్ తెలిపాడు. పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలతో భారత్, పాక్ గొడవను ఆపడంలో ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని అర్ధమవుతోంది. మే 10వ తేదీన భారత్, పాక్ డీజీఎంవోలు మాట్లాడుకొని కాల్పుల విరమణకు అంగీకరించాయి.