శనివారం 04 జూలై 2020
National - Apr 05, 2020 , 11:29:37

ఇంటి గోడకు "హెల్ప్ అజ్" ..పెయింట‌ర్ విజ్ఞ‌ప్తి

ఇంటి గోడకు

పంచ‌కుల‌: లాక్ డౌన్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రెడ్కాడితే కానీ డొక్కాడ‌నీ కుటుంబాల ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. హ‌ర్యానాలోని పంచ‌కులో ఓ వ్య‌క్తి త‌న‌కు రోజు గ‌డిచే ప‌రిస్థితి లేద‌ని, త‌న కుటుంబాన్ని ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాడు. చంఢీగ‌ఢ్‌-పంచ‌కుల రోడ్డుకు స‌మీపంలో ప‌వ‌న్ కుమార్ అనే వ్య‌క్తి ఇళ్లు ఉంది. 

ప‌వ‌న్ కుమార్ పెయింటింగ్ వేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అత‌నికి ప‌ని లేకుండా పోయి, ఇళ్ల గ‌డ‌వ‌టం క‌ష్టంగా మారింది. దీంతో చేసేదేమి లేక త‌న ఇంటి గోడ‌కు హెల్ప్ అజ్ (మాకు సాయం చేయండి) పెయింట్ తో రాశాడు. లాక్ డౌన్ తో నాకు ప‌ని లేకుండా పోయింది. ఆహారం కొనేందుకు చాలా క‌ష్టంగా ఉంది. నా ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు. ప్ర‌భుత్వం ఏదైనా సాయం చేస్తే..నా పిల్ల‌ల‌కు స‌రిప‌డా ఆహారం తెచ్చుకుంటాన‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo