NIA remand : పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) కి పాల్పడిన నలుగురు ముష్కరులకు ఆశ్రయమిచ్చిన నిందితులను జమ్ము కోర్టు (Jammu Court) ఐదు రోజులపాటు ఎన్ఐఏ రిమాండ్‌కు అప్పగించింది. నిందితులు పర్వేజ్ అహ్మద్ (Parvaiz Ahmad), బషీర్ అహ్మద్ (Bashir Ahmad) లను ఎన్ఐఏ అధికారులు ఇవాళ జమ్ము కోర్టులో హాజరుపర్చగా.. అదనపు న్యాయమూర్తి, సెషన్ జడ్జిలు ఐదురోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో నలుగురు ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. మహిళలను, చిన్నారులను వదిలేసి పురుష పర్యాటకులు ఒక్కొక్కరిని పేర్లు అడుగుతూ కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారతీయులు కాగా, ఒక నేపాలీ ఉన్నారు.
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం దర్యాప్తు అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ ఉగ్రవాదులకు పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు ఆశ్రయం ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఇవాళ జమ్ముకోర్టులో హాజరపర్చగా ఐదురోజులపాటు ఎన్ఐఏ రిమాండ్‌కు అప్పగించారు.
#WATCH | Jammu & Kashmir | Parvaiz Ahmad and Bashir Ahmad, who the NIA arrested in connection with the Pahalgam terror attack case, were brought to the Jammu court – the Additional District and Session Judge granted a five-day remand to the NIA, with the next date of hearing on… https://t.co/Q2vSAVY2PN pic.twitter.com/OpkIcPV1BO
— ANI (@ANI) June 23, 2025