Asaduddin Owaisi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod)పై మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం మోదీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Election) విజయం సాధించేందుకు ప్రధాని మోదీ ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై ఆధారపడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ని నరేంద్ర మోదీ ఆశ్రయించాల్సి వచ్చింది’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.
Ek Election jeetne ke liye PM @narendramodi ko Jhoot aur Propaganda par mabni Movie 'The Kerala Story' ka Sahara lena pad raha haipic.twitter.com/ikSfGpgxIx
— Asaduddin Owaisi (@asadowaisi) May 6, 2023
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘జమ్మూ కశ్మీర్లో మన సైనికులు చనిపోతున్నారు.. మణిపూర్ తగలబడిపోతోంది.. ఇవేవీ పట్టని ప్రధాని మోదీ కర్ణాటకలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ‘పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ( Terror Attack) మన సైనికులను చంపుతున్నారు. ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో హింస చెలరేగి (Manipur Issue).. గ్రామాలు తగలబడుతున్నాయి. ప్రజలు ఇండ్లు వదిలి పారిపోతున్నారు. కానీ, మన ప్రధాని మాత్రం ‘ది కేరళ స్టోరీ’ అనే కల్పిత చిత్రం గురించి మాట్లాడటం విచారకరం’ అంటూ మోదీపై మండిపడ్డారు.
Sad that while Pakistan-backed terrorists are killing our soldiers, ugly violence has engulfed Manipur PM #NarendraModi is talking about a ‘fiction’ movie called #TheKeralaStory – #AIMIM chief @asadowaisi on #KarnatakaAssemblyElection pic.twitter.com/wz6rqlaXy1
— Ashish (@KP_Aashish) May 6, 2023
Also Read..
King Charles Coronation | రాజు పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై రాజకుటుంబం కీలక ప్రకటన