Naga Chaitanya | సామ్ మంచి మనిషి.. ఆ వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి : నాగ చైతన్య
Naga Chaitanya | తన మాజీ భార్య, టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) మంచి మనసున్న వ్యక్తి అని నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు.
Naga Chaitanya | తన మాజీ భార్య, టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) మంచి మనసున్న వ్యక్తి అని నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు. విడాకుల అనంతరం సామ్ గురించి మొదటిసారి మాట్లాడారు. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాగచైతన్య తన తదుపరి చిత్రం ‘కస్టడీ’ (Custody) ప్రమోషన్స్ (Promotions) లో బిజీగా ఉంటున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. సమంతతో విడాకుల (divorce) గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
‘అవును. మేము విడిపోయి రెండు సంవత్సరాలు అవుతోంది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాదిదాటింది. కోర్టు కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో ముందుకు సాగుతున్నాము. జీవితంలో ఎదురయ్యే ప్రతి దశను నేను గౌరవిస్తాను. సమంత మంచి మనసున్న వ్యక్తి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేటన్లు ప్రజల్లోకి వెళ్లింది. నాకు బాధ కలిగించిన విషయం అదే’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై కూడా నాగచైతన్య స్పందించారు. ‘ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏంటంటే.. నా గతంతో సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరిచినట్లు అయ్యింది. వ్యక్తిగత జీవితంపై ప్రశ్నించినప్పుడు మొదట్లో పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. మౌనంగా ఉండేవాడిని. ఇప్పటికీ నా పెళ్లి గురించే టాపిక్ తీసుకొస్తున్నారు. ఇలాంటి వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారో..? నాకు అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నాగచైతన్య ‘కస్టడీ’ (Custody) అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో చై కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ప్రియమణి కీలకపాత్రలో నటించిన ఈ సినిమా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి.
Also Read..
India Corona | 3 వేలకు చేరువలో కొత్త కేసులు.. 30 వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు
Mumbai Traffic Cop | వాహనదారుల భద్రతకై రోడ్డుపై ఇసుక చల్లిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు ఫిదా
Gold State Coach: చార్లెస్ దంపతుల ఊరేగింపు ఈ స్వర్ణ రథంలోనే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

