Gold State Coach: చార్లెస్ దంపతుల ఊరేగింపు ఈ స్వర్ణ రథంలోనే..
Gold State Coach: పట్టాభిషేకం తర్వాత గోల్డ్ స్టేట్ కోచ్‌లో చార్లెస్ దంపతులు ఊరేగనున్నారు. ఈ రథాన్ని 1830 నుంచి ఊరేగింపు వేడుకల్లో వాడుతున్నారు. సుమారు 1.6 కిలోమీటర్ల దూరం ఈ ఊరేగింపు జరగనున్నది.
లండన్: కింగ్ చార్లెస్ దంపతులు పట్టాభిషేకం తర్వాత గోల్డ్ స్టేట్ కోచ్(Gold State Coach) రథంలోనే ఊరేగనున్నారు. వెస్ట్‌మినిస్టర్ అబే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఈ రథంలోనే చార్లెస్ దంపతులు వెళ్లనున్నారు. అత్యంత వైభవ రీతిలో ఈ ఊరేగింపు కార్యక్రం జరగనున్నది. సుమారు 1.6 కిలోమీటర్ల దూరం ఈ ఊరేగింపు జరగనున్నది. దాదాపు నాలుగు వేల మంది సైనికులు పహారా కాయనున్నారు. ఈ వేడుకలో 19 మిలిటరీ బ్యాండ్లు పాల్గొంటున్నాయి. ఊరేగింపు కోసం భారీ స్థాయిలో రిహార్సల్స్ చేశారు.
1830 నుంచి పట్టాభిషేక సమయాల్లో ఉరేగింపు కోసం ఈ రథాన్నే వాడుతున్నారు. అశ్వాలు ఈ రథాన్ని లాక్కెళ్లనున్నాయి. తొలుత బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు వెళ్తారు. అయితే ఆ జర్నీ కోసం డైమెండ్ జూబ్లీ స్టేట్ రథాన్ని వాడనున్నారు. లండన్‌లోని ద మాల్, వైట్హాల్ రూట్లో ఈ ఊరేగింపు జరగనున్నది. సుమారు 2.1 కిలోమీటర్ల దూరం ఊరేగింపు ఉంటుంది. 70 ఏళ్ల క్రితం క్వీన్ ఎలిజబెత్ ఊరేగింపు రూటుతో పోలిస్తే ఇది తక్కువే. అప్పట్లో 8 కిలోమీటర్లు మేర ఊరేగింపు నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

