King Charles Coronation | రాజు పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై రాజకుటుంబం కీలక ప్రకటన
King Charles Coronation | మరికాసేపట్లో బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3కి పట్టాభిషేకం (King Charles Coronation) జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బ్రిటన్ (Britain) రాజకుటుంబంపైనే ఉంది.
King Charles Coronation | మరికాసేపట్లో బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3కి పట్టాభిషేకం (King Charles Coronation) జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బ్రిటన్ (Britain) రాజకుటుంబంపైనే ఉంది. ఈ వేడుకకు 100 మంది దేశాధినేతలు, ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, రాజకుటుంబంతో విభేధాల కారణంగా రాచరికాన్ని వదులుకున్న చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ ( Prince Harry) , ఆయన భార్య మేఘన్ మార్కెల్ (Meghan Markle) ఈ పట్టాభిషేక మహోత్సవానికి వస్తారా..? రారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ (Buckingham Palace ) కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది.
‘మే 6వ తేదీన వెస్ట్‌మినిస్టర్ అబే (Abbey Church of Westminister)లో జరుగుతోన్న రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ (Duke of Sussex) హాజరవుతారు. ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్‌తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు’ అని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. మేఘన్-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం అన్న విషయం తెలిసిందే. వారే ఈ ఆర్కీ, లిలిబెట్. రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి.
బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. బ్రిటన్ (Britain) రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు.
ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 (Elizabeth II) గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ (Britain) తదుపరి రాజుగా ఛార్లెస్-3 (King Charles III ) బాధ్యతలు చేపట్టారు. అయితే, అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం (Coronation) మాత్రం ఈరోజు (మే 6న) జరగనుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే (Abbey Church of Westminister)లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది.
Also Read..
Coronation Chair: ఈ కుర్చీలోనే చార్లెస్‌కు పట్టాభిషేకం..
Gold State Coach: చార్లెస్ దంపతుల ఊరేగింపు ఈ స్వర్ణ రథంలోనే..
King Charles Coronation: పట్టాభిషేకంలో కింగ్ చార్లెస్ ధరించే కిరీటాలు ఇవే..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

