King Charles Coronation: పట్టాభిషేకంలో కింగ్ చార్లెస్ ధరించే కిరీటాలు ఇవే..
King Charles Coronation: కింగ్ చార్లెస్ పట్టాభిషేక సమయంలో ఇవాళ రెండు కిరీటాలు ధరించనున్నారు. సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్‌తో పాటు ఇంపీరియల్ స్టేట్ క్రౌన్‌ను ఆయన ధరించనున్నారు. ఇక ఆయన సతీమణి క్వీన్ కామిల్లా .. మేరీస్ క్రౌన్‌ను ధరిస్తారు.
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్‌కు ఇవాళ పట్టాభిషేకం(King Charles Coronation) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహావేడుకను క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్‌కు ఇవాళ అధికారికంగా కిరీటాలు తొడగనున్నారు. వెస్ట్‌మినిస్టర్ అబే లో జరిగే ఆ వేడుకలో ఆయనకు రెండు కిరీటాలను ధరింపచేస్తారు. రాచరిక సంప్రదాయం ప్రకారం మొత్తం మూడు కిరీటాలను వాడనున్నారు. అయితే మూడవ కిరీటాన్ని క్వీన్ కామిల్లా ధరిస్తారు. గత సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్ మృతి తర్వాత బ్రిటీష్ సామ్రాజ్య బాధ్యతలను కింగ్ చార్లెస్ తీసుకున్న విషయం తెలిసిందే. బ్రిటన్ కాలమానం ప్రకారం ఇవాళ 11 గంటలకు పట్టాభిషేక మహోత్సవం ప్రారంభంకానున్నది.
సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్..
కింగ్ చార్లెస్ ధరించే తొలి కిరీటం సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్. పట్టాభిషేక సమయంలో క్యాంటర్బరీకి చెందిన ఆర్చ్‌బిషప్ ఈ కిరీటాన్ని చార్లెస్ శిరస్సుకు తొడగనున్నారు. కింగ్ చార్లెస్-2 కోసం ఆ కిరీటాన్ని 1661లో తయారు చేశారు. మధ్య యుగానికి ప్రతీకగా నిలిచేందుకు ఆ కిరీటాన్ని 1649లో కరగదీసి కొత్త కిరీటంగా రూపొందించారు. ఇదే కిరీటాన్ని 1953లో చార్లెస్ తల్లి ఎలిజబెత్-2 పట్టాభిషేక సమయంలో ఆమెకు తొడిగారు. ఆ కిరీటం బరువు 2.2 కేజీలు ఉంటుంది. పూర్తిగా బంగారంతో తయారు చేశారు. దాంట్లో పగడాలు, ముత్యాలు, ఇంకా రకరకాల జెమ్స్ ఉన్నాయి.
ఇంపీరియల్ స్టేట్ క్రౌన్..
పట్టాభిషేక మహోత్సవం ముగింపు సమయంలో.. సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్ స్థానంలో తక్కువ బరువు ఉండే లైటర్ ఇంపీరియల్ స్టేట్ కరీటాన్ని ధరిస్తారు. ఇంపీరియల్ స్టేట్ క్రౌన్‌ను ప్రభుత్వ కార్యక్రమాల్లో వాడుతుంటారు. పార్లమెంట్ ఓపెనింగ్ సమయంలో ఈ కిరీటాన్నే ధరిస్తారు. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల సమయంలో ఈ కిరీటాన్ని ధరించారు.
ఈ కిరీటం బరువు 1.06 కేజీలు. 31.5 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. దీంట్లో 2868 వజ్రాలు ఉన్నాయి. 11 షాపైర్స్, 11 ఎమరాల్డ్స్, 269 పెరల్స్, నాలుగు రూబీలు ఉన్నాయి. ఈ కిరీటంలోనే అత్యంత ఖరీదైన కలినన్ డైమండ్ కూడా ఉంటుంది.
క్వీన్ మేరీస్ క్రౌన్..
క్వీన్ కామిల్లాకు మేరీస్ క్రౌన్ కిరీటాన్ని ధరించనున్నారు. పట్టాభిషేక సమయంలో జీవితభాగస్వామికి ఈ కిరీటాన్ని తొడుగుతారు. అయితే ఈ వేడుక కోసం ఆ కిరీటంలో స్వల్ప మార్పులు చేశారు. దానికి కలినన్ 3, 4, 5 వజ్రాలను జోడించారు. వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్-2 వ్యక్తిగత జ్వలరీ కలెక్షన్లో ఆ వజ్రాలు ఉండేవి. అయితే క్వీన్ కామిల్లాకు తొడిగే కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని పొందుపరచలేదు. 105.6 క్యారెట్ల ఆ వజ్రం గురించి చాన్నాళ్ల నుంచి వివాదం ఉన్న విషయం తెలిసిందే. భారత్ ఆ వజ్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. క్వీన్ కిరీటంలో ఆ వజ్రాన్ని పొదగడం లేదని తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

