Viral Video | కూలిన స్టేజ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలకు గాయాలు
ర్యాలీ అనంతరం దేవకినందన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో ఆ స్టేజీ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు పార్టీ నేతలు గాయపడ్డారు.
Viral Video | రాయ్‌పూర్: రాజకీయ నేతలు కిక్కిరిసి ఉన్న స్టేజ్ కూలింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, పలువురు నేతలు గాయపడ్డారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గుజరాత్‌లోని సూరత్ కోర్టు పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బిలాస్పూర్లో ఆదివారం కాగడాలతో ర్యాలీ నిర్వహించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్థానిక గాంధీ చౌక్ నుంచి దేవకినందన్ చౌక్ వరకు నిరసన ర్యాలీ సాగింది.
కాగా, ర్యాలీ అనంతరం దేవకినందన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో ఆ స్టేజీ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ సంఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శైలేష్ పాండే, రష్మీ సింగ్‌తోపాటు మరికొందరు పార్టీ నేతలు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారికి వైద్య సేవలందించారు. మరోవైపు స్టేజ్ కూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Chhattisgarh: Stage breaks down during torch rally organized by Congress to protest against termination of Rahul Gandhi's membership of Lok Sabha in Bilaspur. (02.04.23) pic.twitter.com/PjnXREl5JN
— ANI (@ANI) April 3, 2023
Also Read:
Gunned Down | పలు కేసులున్న బీజేపీ నేత.. దుండగుల కాల్పుల్లో మృతి
Viral Video | పిస్టల్‌తో కేక్ కట్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్ కావడంతో అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chhattisgarh
- Collapses
- Injured
- mla
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

