Gunned Down | పలు కేసులున్న బీజేపీ నేత.. దుండగుల కాల్పుల్లో మృతి
అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహించే రాజు ఝాపై అనేక కేసులున్నాయి. ఈ నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. కాగా, శనివారం రాత్రి రాజు ఝా, తన స్నేహితుడితో కలిసి కారులో..
కోల్‌కతా: పలు నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న బీజేపీ నేత దుండగుల కాల్పుల్లో (Gunned Down) మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహించే రాజు ఝాపై అనేక కేసులున్నాయి. ఈ నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. కాగా, శనివారం రాత్రి రాజు ఝా, తన స్నేహితుడితో కలిసి కారులో హైవేపై కోల్‌కతా వెళ్తున్నారు. మార్గమధ్యలో ప్రధాన విరామ కేంద్రమైన శక్తిగఢ్ వద్ద ఆగారు. రాజు ప్రయాణించిన కారు హైవేపై నిలిచి ఉండగా దాని పక్కగా మరో కారు ఆగింది. అందులో ఉన్న వ్యక్తులు రాజుతోపాటు అతడి స్నేహితుడిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రాజు ఝా మరణించగా, అతడి స్నేహితుడికి బుల్లెట్ గాయాలయ్యాయి.
కాగా, బీజేపీ నేత రాజు ఝాపై కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. పారిపోయిన హంతకులతోపాటు వారు ప్రయాణించిన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక వ్యాపారులు, టోల్ ప్లాజాల వద్ద పోలీసులు ఆరా తీస్తున్నారు. బీజేపీ నేత రాజు ఝా, దుండగుల కాల్పుల్లో మరణించడం దురదృష్టకరమని ఎస్పీ కమనశిష్ సేన్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ నేత కారు డ్రైవర్‌ను కూడా ప్రశ్నిస్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

