న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో లక్షకుపైగా ఖాళీ లు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది.
సెప్టెంబర్ 30 నాటికి సీఏపీఎఫ్, ఏఆర్లలో మొత్తం 9,48,204 మంది సిబ్బంది ఉన్నట్టు కేంద్ర హోంశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఖాళీలను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.