న్యూఢిల్లీ : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 2,700 మంది భారతీయులను ట్రంప్ సర్కారు దేశం నుంచి పంపించివేసిందని భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది.
ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 2,790 మంది భారతీయులు అమెరికా నుంచి, 100 మందికిపైగా భారతీయులు బ్రిటన్ నుంచి బహిష్కరణకు గురైనట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణబీర్ జైస్వాల్ చెప్పారు.