కచ్: గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మరో 24 గంటలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం భారీ స్థాయిలో అక్కడ వరదలు వచ్చాయి. నవసరి పట్టణంలో వరద రావడంతో.. ఓ గ్యాస్ ఏజెన్సీలో ఉన్న సిలిండర్లు(Gas Cylinders) ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జునాతనా ఏరియాలో ఉన్న జుమ్రు గ్యాస్ ఏజెన్సీ ఆవరణలో ఉన్న దాదాపు వందకుపైగా సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
Flood like situation in Navsari city
Gas cylinders of Jhumru Gas Agency in Junathana area were also washed away in water#GujaratRain #navsari pic.twitter.com/Uk2gUvAFOg
— Ishani Parikh (@ishaniparikh) July 22, 2023