న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారత్లో 32.5 శాతం కళాశాల విద్యార్థులు ఇప్పటికే వ్యాపారాలను ప్రారంభించడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నారని ఐఐటీ-మండీ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు 25.7 శాతం కన్నా ఇది ఎక్కువని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల్లోని విద్యార్థి వ్యాపారవేత్తలపై నిర్వహించిన ‘గ్లోబల్ యూనివర్సిటీ ఆంత్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే-2023’లో భాగంగా దేశీయంగా ఓ సర్వే నిర్వహించి ఈ నివేదికను వెలువరించింది. ఐదేండ్ల క్రితం డిగ్రీ తర్వాత 69.7 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం అన్వేషించేవారని.. ఇప్పుడు అది 52.2 శాతానికి తగ్గిపోయిందని నివేదిక వెల్లడించింది.
కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 21: ఛత్తీస్గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లో తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య సోమవారం సాయంత్రం భీకర పోరు సాగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామర్గఢ్ తహసీల్ పరిధిలోని కోపరీ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో సీ-60 భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. వీరికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఇరు పక్షాల మధ్య సుమారు అరగంట పాటు కాల్పులు సాగాయి. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు.